Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
Menu
  • Home
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
  • Activity
    • Events
    • Classes
    • Services
  • About us
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 5

Shiva Lingam decorated with glowing diyas for Karthika Puranam Day 5 — Hindu festival image symbolizing devotion to Lord Shiva during the sacred month of Karthika.

కార్తీక పురాణము ఐదవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
ధర్మవారధి శ్రోతలలందరికీ శుభోదయం. మనము కార్తీక పురాణములో ఏ రోజు అధ్యయ పారాయణ ఆ రోజు చేస్తూ అందులోని విశిష్టతను మీకు వివరిస్తూ వస్తున్నాను. నిన్నటి రోజున మీకు అజామీలోపాఖ్యానంలో కథ మనము ప్రారంభం చేసుకున్నాము.

అజమీళుడు తన కుమారుడి నామాన్ని (నారాయణ, నారాయణ) అని స్మరిస్తూ ప్రాణ త్యాగం చెయ్యటం, అక్కడికి విష్ణు దూతలు, యమా దూతలు రావటం, వారి మధ్య సంవాదం జరగటం సూక్ష్మ శరీరముతో అజామిళుడు చూస్తున్నాడు. విష్ణు దూతలు యమ దూతల్ని ఇలా ప్రశ్నించారు, “పాపాత్ములెవ్వరు, పుణ్యాత్ములెవ్వరు. యమధర్మరాజు మీకు చెప్పిన సూత్రాలేమిటి కాస్త చెప్పండి అని” అందుకు విష్ణుదూతలు వారికి ఇలా సమాధానం ఇస్తున్నారు. ” మానవులు చేసే పాపాలకు సాక్షులుగా ఈ సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఆకాశము, దశదిశలు, కాలాలు. సూర్యుడు, చంద్రుడు అంటే పగలు చేసిన పాపము సూర్యుడు, రాత్రి చేసిన పాపము చంద్రుడు చూస్తూ ఉంటారు అని అర్థము. అలాగే గాలి వీచని చోటు ఉండదు కనుక వాయువు, ఆకాశము. ఏ దిక్కున చేసినా ఆ దిక్కుకు అధిపతులైన దేవతలు చూస్తూ ఉంటారు. అలాగే కాలాలు, ఏ కాలములో చేసిన ఆ కాలం గమనిస్తూ ఉంటుంది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఆకాశము, దశదిశలు, కాలాలు వీటన్నిటిని మానవులు చేసిన పాపపుణ్యాలను విచారించి, వారికి తగిన శిక్ష విదిస్తాము.

ఓ విష్ణు దేవతలారా శ్రద్దగా వినండి, ఎవరు పాపాత్ములు అంటే వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, అసత్య వాదులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను – కులవృతిని తిట్టి హింసి౦చువారున్నూ, జీవహింసచేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ, తలితండ్రుల శ్రద్ద కర్మలను వదిలివేసిన వారు, పరస్త్రీని ఆశించేవారు, కేవలం భోజనం గురించే ఆలోచించేవారు పాపాత్ములు.

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్

అని గీతలో శ్రీకృష్ణపరమాత్మ పేర్కొన్నారు. శాస్త్రములు మనకు, ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనే ఉపదేశాలను చెపుతాయి. శాస్త్రాన్ని అంగీకరించకుండా స్వేచ్చా జీవులవలె తమకు ఏది నచ్చితే అదే చేసే వారికి నరకం మాత్రం తప్పదు.

ఈ అజమిళుడు చెయ్యని పాపం లేదు కనుక యితడు నరకానికి వెళ్ళాక తప్పదు అని యమదూతలు చెప్తారు. అప్పుడు విష్ణుదూతలు వారితో ఇలా పేర్కొంటారు, “ఓ యమకి౦కరులారా! ధర్మసూక్ష్మములను మీకు వివరిస్తాము, వినండి. మంచివారితో స్నేహం చేసేవారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేసేవారు, అనాధప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువారు, తటాకములు త్రవ్వి౦చువారు, శివకేశవులను పూజి౦చువారు, సదా హరి నామస్మరణ చేయువారు ఎప్పుడు నరకానికి పోరు. అయితే ఈ అజమిళుడు ఇవన్నీ చేయలేదు, కానీ ఇతను చేసిన పుణ్యకర్మ ఒకటుంది”.

ఎవరైతే తమ మరణకాలమందు ‘నారాయణా’యని శ్రీ హరిని గాని, ‘శివ’ అని శివుని గాని స్మరించేవారు, తెలిసిగాని తెలియక గాని మరే రూపమునగాని హరి నామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’ అని స్మరిస్తూ చనిపోయాడు కావున, మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోతాము” అని అన్నారు.

అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః

అని గీతలో కృష్ణపరమాత్మ పేర్కొంటాడు.

విషు, యమ దూతల సంవాదం వింటున్న అజమిళుడు, “ఆహా! నేను పూర్వజన్మలో ఏమి సత్కార్యం చేసానో కానీ ఈ జన్మలో ఆ మరణ సమయములో నారాయణ అని పలుకగలిగాను”, అని ఆశ్చర్యపోతాడు. ఈ కథ వింటున్న జనకమహారాజు వశిష్ఠులవారిని “ఓ మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు పూర్వజన్మ ఎలాంటిది? పూర్వజన్మంలో ఏ పాపములు, పుణ్యములు చేసాడు?”, అని ప్రశ్నిస్తాడు. అప్పడు వశిష్టుడు జనకమహారాజుతో, “మహారాజా, మీరు అడిగినవన్నీ వివరిస్తాను వినండి”, అని ఆ రాజుకి తరువాత జరిగిన కథ గురించి వివరించసాగారు.

అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్లి జరిగింది వివరిస్తారు. యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, “ఓహో! అతను తన మరణసమయమున ‘నారాయణా’ అని స్మరించాడు కావున వైకుంఠానికి వెళ్ళటానికి అర్హుడే” అని గ్రహిస్తాడు.

అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములో ఒక శివాలయములో అర్చకుడు.ఆ జన్మలో కూడా అతను ధర్మమార్గమును విడచి, పర స్త్రీ సంగమముతో భ్రష్టుడై తిరుగుతూ ఉండేవాడు. ఎవరి నాలిక అయితే హరిని కీర్తించదో, ఎవరి మనస్సు హరిచరణాల మీద నిలువదో, ఎవరి చెవులు హరి కీర్తనలు ఆలకించవో వారి పాపములు ఏ విధంగానూ నశించవు. హరినామము అంతటిది.

కంజాక్షునకు గాని కాయంబు కాయమే
పవన గుంభిత చర్మభస్త్రిగాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే
ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక

అని పోతన భాగవతములో పేర్కొంటారు.

అజామీళుడు తన పూర్వజన్మలో చేసిన పాపముల వలన వ్యాధి పీడితుడై మరణించి, రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మళ్లీ మానవ జన్మ పొంది కార్తీకమాసమున నదీస్నానము చేసి దేవతాదర్శనము చేసిన పుణ్యం వలన, అతని పాపములు నశించి ఈ జన్మలో అజామీళుగా జన్మించాడు, ఉత్తమగతులు పొందగలిగాడు”, అని వశిష్ఠమహర్షి జనకమహారాజుకు వివరిస్తాడు.

కార్తీకమాసములో పౌర్ణమి, ఏకాదశి, సోమవారం ఇవ్వని కూడా విశేషమైన రోజులు. ఈ కాలములో హరి నామ స్మరణ కానీ, హర నామ స్మరణ కానీ చేసిన వారు ఉత్తమ జన్మ పొందుతారు, వారు మోక్షానికి అర్హులు అవుతారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు అని వశిష్ఠుల వారు జనకమహారాజుకి చెప్పారు.

కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉసీరి నిషిద్దము. అలాగే ఎవరి ఏది ఇష్టమో అది నిషిద్దము, అంటే ఆనాడు మనకిష్టమైనవి వదిలివేసే ప్రయత్నం చెయ్యాలి. అలాగే చిమ్మిని దానం చేస్తే దేవతా ప్రీతి కలుగుతుంది. ఆనాడు సుబ్రమణ్యుడిని ఆరాధించిన వారికి సత్సంతానం, జ్ఞానం లభిస్తాయి అని శాస్త్రం పేర్కొంటోంది. రేపటి రోజున పారాయణ అంశంతో మళ్లీ కలుసుకుందాము.

ధర్మస్య విజయోస్తు!

Karthika Puranam – Day 5:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam

Salutations to Shiva and Parvathi! Salutations, salutations to Shankara and Parvati. We are diligently performing the daily reading and discourse of the Karthika Purana, explaining its significance to you. Yesterday, we began the story of Ajamila.

Ajamila breathed his last while chanting his son’s name, ‘Narayana, Narayana.’ Vishnu’s messengers (Vishnudutas) and Yama’s messengers (Yamadutas) arrived there, and Ajamila, in his subtle body, witnessed the debate between them. The Vishnudutas questioned the Yamadutas, saying, “Who are the sinners and who are the virtuous? What are the principles that Yama-Dharmaraja (the God of Dharma) has instructed you? Please tell us.” To this, the Yamadutas replied, “The witnesses to the sins committed by humans in this creation are the Sun, the Moon, the Wind (Vayu), the Sky (Akasha), the ten directions (Dashadishas), and the seasons (Kalas). The Sun and the Moon mean that the Sun watches the sins committed during the day, and the Moon watches the sins committed during the night. Similarly, the Wind, as there is no place where the air does not blow, and the Sky. The presiding deities of whatever direction a sin is committed in, watch it. Likewise, the seasons—the time in which a sin is committed keeps a watch. Therefore, we examine the merits and sins committed by humans, with the Sun, the Moon, the Wind, the Sky, the ten directions, and the seasons as witnesses, and dispense the appropriate punishment.

O messengers of Vishnu, listen carefully. The sinners are those who abandon the righteous conduct prescribed in the Vedas, who criticize the Vedic scriptures, who commit great sins like cow slaughter and killing of a Brahmin, who are liars, who abuse and torment their parents, teachers, relatives, and professional community, who commit violence against living beings, who oppress people by increasing interest through fraudulent accounts, who are corrupted by adultery and theft, who usurp others’ property, who commit infanticide, who trouble even those who seek refuge, who are ungrateful (Kritaghnas) and forget a good deed done, who obstruct marriages and auspicious ceremonies, who abandon the annual remembrance rituals (Shraddha Karma) for their parents, who lust after another’s wife, and those who only think about eating.

Yaḥ śāstravidhimutsṛjya vartate kāmakārataḥ
na sa siddhimavāpnoti na sukhaṁ na parāṁ gatim

(He who, setting aside the injunctions of the scriptures, acts according to his own whims, attains neither perfection, nor happiness, nor the supreme goal),’ as stated by Lord Krishna in the Gita. The scriptures instruct us on what to do and what not to do. Hell is inevitable for those who ignore the scriptures and act as free-willed people, doing whatever they like.

The Yamadutas state that Ajamila has not left any sin undone, and therefore, he must go to hell. Then the Vishnudutas reply to them, “O servants of Yama! We will explain the subtle principles of Dharma to you; please listen. Those who associate with good people, who perform Japa (chanting), charity (Dana), and righteousness (Dharma), those who perform the charity of food (Annadana), the charity of a maiden (Kanyadana), the charity of a cow (Godana), and the charity of a Saligrama stone, those who perform the last rites (Samskaras) for orphaned corpses, those who cultivate a Tulasi garden, those who dig ponds, those who worship Shiva and Keshava, and those who constantly remember the name of Hari (God) never go to hell. However, Ajamila did not do any of these, but he did perform one virtuous deed.”

“Whoever remembers Sri Hari as ‘Narayana’ or Shiva as ‘Shiva’ at the time of their death, or those whose ears hear the chanting of Hari’s name, whether knowingly or unknowingly, in any form, are virtuous! Therefore, even though Ajamila was a great sinner, since he died remembering ‘Narayana’ at the time of his death, we will take him to Vaikuntha,” they said.

Antakāle ca māmeva smaran muktvā kalevaram
yaḥ prayāti sa madbhāvaṁ yāti nāstyatra saṁśayaḥ

(And whoever, at the time of death, quits his body, remembering Me alone, at once attains My nature. Of this, there is no doubt),’ as stated by Lord Krishna in the Gita.

Ajamila, listening to the debate between the Vishnu and Yama messengers, is astonished, thinking, “Alas! What good deed did I perform in my previous birth that I was able to utter ‘Narayana’ at the time of my death in this birth?” Janaka Maharaja, upon hearing this story, questions Vashishtha, “O best of the Sages! What was the previous birth of this Ajamila? What sins and merits did he commit in his previous birth?” Vashishtha then begins to explain the subsequent story to the king, saying, “Maharaja, I will explain everything you have asked; please listen.”

After the Vishnudutas took Ajamila to Vaikuntha, the Yamakinkaras went to their master, Yama-Dharmaraja, and explained what had happened. Yama, through his divine vision, learned the history of Ajamila’s previous birth and realized, “Oh! Since he remembered ‘Narayana’ at the time of his death, he is indeed worthy of going to Vaikuntha.”

Ajamila, in his previous birth, was a priest in a Shiva temple in the Maharashtra region. Even in that birth, he abandoned the path of Dharma, became corrupt by associating with another’s wife, and wandered about. The sins of those whose tongue does not praise Hari, whose mind does not rest on Hari’s feet, and whose ears do not listen to Hari’s praises will not be destroyed in any way. Such is the power of Hari’s name. ‘ Kanjākṣunaku gāni kāyaṁbu kāyamē pavana guṁbhita carmabhastrigāka vaikunṭhu bogadani vakraṁbu vakramē ḍhamaḍhama dhvanitōḍi ḍhakkagāka ‘ (Is the body which does not belong to the Lotus-Eyed one really a body, or just a leather bellows filled with air? Is the mouth which does not praise Vaikuntha (Vishnu) really a mouth, or just a drum with a ‘ḍhamaḍhama’ sound?), as stated in the Potana Bhagavatam.

Vashishtha Maharshi explains to Janaka Maharaja, “Due to the sins committed by Ajamila in his previous birth, he suffered from disease, died, fell into the hell-pits like Raurava, and endured various torments. He was born again as a human. Due to the virtue gained by taking a ritual bath in a river and having the sight of the deities (Devata Darshanam) in the month of Karthika, his sins were destroyed, and he was born as Ajamila in this life and attained the supreme state.”

Vashishtha tells Janaka Maharaja that the full moon (Pournami), the eleventh day (Ekadashi), and Monday (Somavaram) in the month of Karthika are all special days. There is no doubt that those who chant the name of Hari or Hara during this period will attain a superior birth and become eligible for salvation (Moksha).

On Karthika Shuddha Shashthi (the sixth day of the bright fortnight), the Usiri (Indian Gooseberry/Amla) is prohibited. Also, whatever is one’s favorite thing is prohibited on that day, meaning one should try to give up what they like. Similarly, donating Chimmini (likely a kind of lamp or a sweet dish) brings the favor of the deities. The scriptures state that those who worship Subramanya on that day will receive good progeny and knowledge. We shall meet again tomorrow with the topic for the next day’s reading. May Dharma be victorious!

Dharmasya Vijayosthu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy