Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
Menu
  • Home
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
  • Activity
    • Events
    • Classes
    • Services
  • About us
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 2

కార్తీక పురాణము రెండవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

యమద్వితీయ కార్తీకశుద్ధ విదియ శుభాకాంక్షలు. కార్తీక పురాణంలో రెండవరోజు పారాయణ చేయవలసినటువంటి అంశము

ఇవేళ వశిష్ట మహాముని రాజర్షి అయిన జనకుడుతో సంభాషణ ఇలా సాగుతున్నది: “రాజా! స్నాన, దాన, జప, తపాలలో ఏదైనాసరే, ఏకొంచెం అయినా ఈ కార్తీక మాసంలో ఆచరిస్తే, అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీకవ్రతాన్ని ఆచరించక పోతే అటువంటివారు ఉత్కృష్ట జన్మలు పొందలేరు; నికృష్టజన్మలకు వెళ్ళిపోతారు. “పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాదీస్తు నాచరన్”, అని పౌర్ణమినాడు కార్తీకమాసంలో స్నానాదులు చేయకుండా వదిలేస్తే వారికి ఉత్తమగతులు ప్రాప్తించవు. బ్రహ్మరాక్షసులుగా కూడా పరిణమిస్తారు అని వశిష్ట మహర్షి జనకమహారాజుతో చెప్తూ, ‘తత్వనిష్టోపాఖ్యానము’ అనేటటువంటి ఒక ఉపాఖ్యానము మహర్షి అందించారు.

తత్వనిష్ఠుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. ఏనాడూ అసత్యాలు పలికేటువంటివాడు కాదు.

అన్ని భూతములయందూ దయ కలిగి ఉండేవాడు. తీర్థయాత్రలు అంటే అమితమైనటువంటి ఆసక్తి. అటువంటి ఆయన ఒకానొక సందర్భంలో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా మార్గమధ్యంలో గోదావరీ తీరాన గల ఒక ఎత్తయిన మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాట్ట. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు భయంకరమైన రూపాలు కలిగి ఉన్నారు వారు. గుచ్చినటువంటి ఇనుపతీగలు ఎలా ఉంటాయో అటువంటి వెంట్రుకలు, వికృత వదనాలతో ఉన్నారు. కత్తులు, కపాలాలు ధరించి ఉన్నారు, చూస్తేనే భయమేసేటువంటి స్వరూపాలవి. ఆ భయంతో అతడు శ్రీహరిని స్మరించ ప్రారంభించాడు. “కూలినచోట, కొట్టబడి త్రుళ్ళినచోట, మహాజ్వరాదులం పేలినచోట”, శ్రీహరిని ఎక్కడెక్కడ స్మరిస్తామంటే, మనకి ఎక్కడ

భయంకలిగిందో, ఎక్కడ జ్వరం వచ్చిందో, ఒళ్లు తెలియని స్థితిలో ఉన్నప్పుడు. భగవంతుడు కష్టం వచ్చినప్పుడే గుర్తొస్తాడు కదండీ! అలాగే ఆయనక్కూడా గుర్తువచ్చాడు. శ్రీహరిని ధ్యానించాడు. హరిని స్తోత్రంచేశాడు. “త్రాహి దేవేశ లోకేశ  త్రాహి నారాయణవ్యయ”, అని ఆయన్ని స్తోత్రం చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఈ బ్రహ్మరాక్షసులకు అతన్ని చూడగానే జ్ఞానోదయమైంది. జ్ఞానోదయమై, ఆయన ఎదురుగా వచ్చి నమస్కరించి “మీ దర్శనంతోనే మా పాపాలు నశించిపోయాయి స్వామీ.”

[ ఇటువంటి సంఘటనలు మనకి ఎప్పుడో పురాణాల్లో కాదు, ఈ మధ్యకాలంలో త్యాగరాజుల వారి చరిత్ర చదివితే అందులో దొంగలు ఆయన వెనుక పడ్డట్టు కూడా కనబడుతుంటుంది  ఆచరిత్రలో కూడా. అంటే ఎప్పుడో  త్రేతాయుగంలోనో, కృతయుగంలోనో కాదు, కలియుగంలో కూడా ఇటువంటివి జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది.]

సరే! ఈ బ్రహ్మరాక్షసులు వచ్చి ఆయనకు నమస్కరించి, “మీ దర్శనం తోనే మా పాపాలన్నీ నశించిపోయాయి; అయితే మాకు ఈ రాక్షసత్వం పోయి, మాకు ముక్తి కలిగే మార్గం చెప్పండి”, అని అడిగారు. అడిగితే, ఇతడు వారిని ప్రశ్నించాడు మళ్ళీ, ఆ బ్రహ్మరాక్షసులని: “ఎవరయ్యా మీరు? ఏమిటి మీ ఉదంతము? ఎందుకిలా బ్రహ్మరాక్షసులై తిరుగుతున్నారు?”, అని.

అప్పుడు ఒకాయన, “నేను ద్రవిడ దేశంలో మంధరం అనే గ్రామాధికారిగా ఉండేవాడిని. వంచనతో సంపాదించి, నాకున్నటువంటి చమత్కారంతో, వాక్కుతో పది మందిని మోసం చేసి నా కుటుంబ శ్రేయస్సుకై అందరినీ మోసం చేసేవాడిని. బంధువులకుగానీ బ్రాహ్మణులకుగాని, ఏనాడూ పట్టెడన్నం పెట్టలేదు. నయవంచనతో ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతోసహా ఏడుతరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. నా మరణం అయిన తర్వాత నరకయాతన అనుభవించి చివరికి ఇలా ప్రస్తుతం బ్రహ్మరాక్షసుడుగా అయ్యాను. అందువల్ల దయచేసి నాకు ముక్తినిచ్చే మార్గం చెప్పండి.” అని ఆయన కోరుకున్నాడు.

మరొకాయన, “అయ్యా, నేను నా తల్లిదండ్రులతో ఎప్పుడూ కలహించే వాణ్ని. వారిని దూషిస్తూ ఉండేవాణ్ణి. నేనూ, నాభార్యా, పిల్లలు మాత్రం మృష్టాన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పెట్టేవాణ్ని. ఏనాడు కూడా బంధువులను పిలిచి ఒక పూటయినా భోజనం పెట్టలేదు. విపరీతంగా ధనార్జన చేసి, ఆ కావరంలో బతికాను. నా శరీరం పడిపోయిన తర్వాత, ఘోరాతిఘోరమైన బాధలనుభవించి నరకంలోచివరకు ఇలా తిరుగుతున్నాను. నాక్కూడా ముక్తిని ప్రసాదించండి”, అని అడిగారు.

మూడవ రాక్షసుడు చెప్తున్నాడు: “ఓ సదాచార సంపన్నుడా! నేను విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావి, కఠినవచస్కుడను, అంటే మాట కఠినంగా ఉండేదన్నమాట. భక్తులు స్వామివారి కర్పించినటువంటి కైంకర్యాలనన్నింటినీ వేశ్యాలోలుడనై, విష్ణుసేవను సక్రమంగా చేయక, చివరికి గుడిలో దీపాల్లొ నూనెను కూడా హరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాన్ని అనుభవిస్తూ, పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించే వాడిని. ఈనా దోషాలు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి ఇప్పుడు రాక్షసుడునై తిరుగుతున్నాను. కాబట్టి నాక్కూడా ముక్తినొందే మార్గం చెప్పండి” అని నమస్కరించాట్ట.

అప్పుడు ఈ తత్వనిష్ఠుడనేటటువంటి ఆయన, “మీరు భయపడకండి. నాతో కలిసి కార్తీకస్నానానికి రండి. మీ సమస్తదోషాలు నశించిపోతాయి”, అని చెప్పి వారిని తనవెంట బయల్దేరదీసి, అందరూకలిసి కావేరినదిని చేరి, కావేరినదిలో  ఆ బ్రాహ్మణుడు సంకల్పం చెప్పుకొని, స్నానం చేసి, తాను చేసినటువంటి స్నానఫలితాన్నివీరికి ధారపోస్తే, వారంతా కూడా దివ్యవేషులై తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కాబట్టి ఓ జనకమహారాజా”,  [ఇది ఎవరు  చెప్తున్నారు? చెప్పినారు? వశిష్ఠుల వారు చెప్తున్నారు. గుర్తుంచుకోవాలి మీరు.]

 “కాబట్టి ఓ జనకమహారాజా! అజ్ఞానం వలన గాని మోహప్రలోభాలవల్ల గాని, మరి ఏ కారణం చేతనైనా గాని కార్తీకమాసం సూర్యోదయకాలంలో కావేరినదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందయ్యా. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానం చేయాలి. కావేరి సాధ్యంకాకపోతే గోదావరిగాని, కృష్ణగాని, మరియే జీవనది యందు స్నానం చేసినా అటువంటి ఫలితమే వస్తుంది. అలా ఎవరైతే కార్తీక దామోదరుడిప్రీతిగా ప్రాతస్నానం చేస్తారో వారికి సర్వసుఖాలు అబ్బుతాయి. ఎవరైతే చేయరో వారికి ఊర్ధ్వ గతులు ప్రాప్తించవు అనితెలుసుకోవాలి.” అని చెప్తూ, వశిష్ఠులవారు జనకమహారాజుకి కార్తీక దీపారాధన మహిమను  కూడా సత్రాజిత్తు చరిత్ర ద్వారా మనకు తెలియ చేస్తారు. మరొక సందర్భంలో ఆ సత్రాజిత్తు చరిత్రను తెలుసుకుందాం. రేపటి రోజున అంటే కార్తీక శుద్ధ తదియ నాడు ఉసిరికాయ తినకూడదు; పులిహార దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం;  అలాగే అట్లు, బెల్లం వీటినికూడా దానంచేయవచ్చు. గౌరీ పూజ, త్రిలోచన గౌరీ వ్రతం అని విశేషంగా చేస్తారు. గౌరీ పూజ చేసుకుంటే అఖండ సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. మరి తరవాత అంశంతో రేపు కలుద్దాం.

ధర్మస్య విజయోస్తు!

Karthika Puranam – Day 2:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam

Greetings to all Hindu Bandhus on the occasion of Yama Dvitheeya Kaartheeka Suddha Vidiya ( Second day of the month of Karthikam)

The topic of this second day is the discourse by Sri Vasistha Maharshi to the Rajarshi King Janaka which goes on as follows:

“Raaja!  Among taking sacred bath, donation, chanting and penance, if one performs even one of these even to a small extent during this month of Kaartheekam, it will yield limitless fruits. If someone is slave to comforts and/or hesitates to subject the body to hardship, their future births will not be at a higher level. If one does not take bath on the full moon day of this month, they will not be able to make an upward journey. On the other hand, they might even evolve into raakshasaas (demons). In this context the Maharshi has given us an upaakhyaanam (story) by name Tatvanishtopaakhyaanamu as part of Kartheeka Puraanam.

There was a brahmin who was a true Tatvanishta. He was a scholar in all shaastraas, never told a lie in his life, was kind towards all creatures and had interest in making pilgrimages. On one piligrimage he saw on a tall banyan tree on the banks of Godavari river, three raakshasaas. They were of fearsome appearance with hair looking like sharp iron spikes, ugly faces, wielding swords and wearing garlands of skulls, sure to strike terror into everyone unfortunate enough to look at them. Horrified at their appearance the brahmin started chanting the name of Sri Hari. As the Bhagavatham states, one remembers Sri Hari especially when one is afraid, or is struck down with fever, or is devastated by some crisis. The brahmin chanted over and over again “ Traahi Lokesha Devesha Traaha Naraayanavyaya”. As the brahmin started chanting the name of Sri Hari, rays of Jnaana ( wisdom) dawned on the three raakshasaas

[A relatively more recent incident of this type happened in the life of the saint-poet Sri Thyagaraaja Swamy when some bandits intended to waylay the group in which he was travelling. After coming into contact with him for a few minutes they were transformed into good people. This proves that such miracles can happen even in Kali Yuga and are not limited to the Treta Yuga or Dwaapara Yuga. Back to our story]

The three raakshasaas prostrated before the brahmin and said “Sir, we request you to tell us how we can be freed from present Raakshasa life”. He asked them in turn “ Who are you, what is your story and why are you living like this as Raakshasas?”

One of them said “ In my previous life I was the head of Mandhara village in Dravida Desam. Through my intelligence, silver-tongue and deceit, I cheated all the villagers and accumulated wealth for my family. I never gave even a morsel of food to relatives or any brahmins. Due to this not only I, but all my family members up to seven generations suffered greatly. After death,  I literally went to hell and finally took birth as a raakshasa. Please tell me how I can be free”.

The second one said, “I used to fight with my parents all the time and speak harshly to them. While my wife, children and I enjoyed sumptuous feasts, we used to feed our parents only leftovers from the previous day. We never gave food to any relatives even once. I earned huge wealth and after death spent a long period in Hell. Finally I am here as Raakshasa. Please tell me how I can be liberated from this life.”

The third Raakshasa said, ”O practitioner of noble traditions! I was a priest in a Vishnu temple in my previous life. I was arrogant, had a sharp tongue and worst of all used to visit brothels often. I embezzled gold and money devotees offered to the deity and even stole the oil meant for lighting for lamps. As a consequence of neglecting my duties coupled with my heinous behaviour I became a raakshasa and am wandering  like this. Kindly show me how to get liberation”.

The brahmin said to them, “ Do not worry, come with me for a Karthika bath. All your defects will be neutralised. So saying, he took them to  the Kaveri river, and after they all bathed he donated the fruit of his own bathing also to them. As a result the present raakshasa form was replaced by a glowing divine form for each of them and headed towards Vaikuntham (the Abode of Sri Vishnu).

Vasishta concluded, “If one bathes in Kaveri river for whatever reason, (even out of ignorance, greed, or selfishness), does pooja to Vishnu in Karthika Maasam, one will doubtless receive the fruit of doing ten thousand yagnas. If bathing in Kaveri is not possible, Godavari, or any other perennial river is also equally good. You must understand that whoever does an early morning bath in the river will be uplifted to higher levels. Otherwise the journey is downward”.  After saying this Vasishta Maharshi also narrated the good effect of donating a lamp in Karthika Maasam as practiced by Kind Satraajith and we shall see this on another day.

Tomorrow is tadiya, the third day. On this day one should not eat Aamla ( goose berry). If you donate pulihora (tamarind rice/ lemon rice) or dosas, jaggery on this day, it is good. Doing Gowri pooja through Trilochana Gowri vratham ensures eternal Sowbhaagyam.

Dharmasya Vijayosthu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy