Guru Puja 2025
సనాతన ధర్మ వారధి
పరోపకారార్ధం ఇదం శరీరం
గురుపూజోత్సవము 2025
ప్రతివారు వారి గురువుని గురు పౌర్ణమి రోజు వ్యాసుని రూపంలో పూజించాలి.
అందుకే మనం ఈ పౌర్ణమికి మన పూజ్య గురువు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారిని సాక్షాత్తు వ్యాస రూపంలో 10/7/25 గురువారం ఉ.6.00 నుంచి మ.1.00 వరకు
ఉషా హరి కన్వెన్షన్
బైపాస్ రోడ్డు
ఖమ్మం లో
పూజించుకొనే కార్యక్రమ నిర్వహణకు ఖమ్మం అనుసంధానకర్తలు ముందుకు వచ్చారని సంతోషంగా తెలియజేయుచున్నాము.
ఈ కార్యక్రమము కు శ్రీ ఈశ్వర ప్రగడ హరిబాబు గారు విశాల హృదయముతో తమ ఉషాహరి కన్వెన్షన్ ను మరియు అన్నప్రసాద వితరణ ను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారని ఆనందంగా తెలియజేయుచున్నాము.
కావున మీరు మీ బంధుమిత్రులతో ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య గురువుగారి అనుగ్రహభాషణము విని దివ్య ఆశీస్సులను పొందగలరని ప్రార్థన.
లోక కళ్యాణార్థం సామూహిక సౌందర్యలహరి, లలిత సహస్రనామ మరియు హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించుచున్నాము. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి మరియు హనుమద్దేవుల కృపా కటాక్షములు పొందగలరు.
మీ రాకను ఖచ్చితముగా గూగుల్ ఫామ్ ద్వారా తెలియజేయగలరు.
సదా సనాతన ధర్మ వ్యాప్తిలో
ఖమ్మం జోన్ అనుసంధాన కర్తలు
శ్రీ ఇంగువ జనార్ధన రావు
శ్రీ శివరాజు సత్యనారాయణ
శ్రీ కందిబండ రమా మనోహర్ రావు
కె.సి.డి.టి ప్రధాన అనుసంధాన కర్తలు
గోటేటి శశికిరణ్
కంది బండ ప్రసాదరావు
గమనిక:- హైదరాబాదు నుంచి ఖమ్మం కు 10/7 న ప్రత్యేక బస్సు నడుపబడును. ఉత్సాహవంతులు
9494877070
9000498121
9491639961
సంప్రదించగలరు.