Karthika Puranam Day – 16
కార్తీక పురాణము పదహారవ(రోజు) అధ్యాయము:
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.
కార్తీకమాసంలో విశేషంగా ఈరోజు (16వ రోజు) పారాయణ అంశాన్ని ఇప్పుడు మీకు సంక్షిప్తంగా వినిపించే ప్రయత్నం చేస్తాను.
సూతమహాముని చెప్పినటువంటి స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్త్యాన్ని విని సంతుష్టులైనటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ, “హే సూతమునీ! లోకోత్తర పుణ్యదాయకమైనటువంటి కార్తీకపురాణము స్కాందమందే కాకుండా పద్మపురాణంలో కూడా ఉందికదా! అదికూడా కొంచెం విశదపరచవలసింది”, అని వారు ప్రార్థన చేశారట. సూతమహాముని మందస్మిత వదనారవిందుడై, చిరుదరహాసం చేసి, “వైకుంఠుని లీలావినోదాలు వినేవారికి, వినిపించేవారికీ కూడా విశేష పుణ్యాన్నిస్తాయి. విసువుమాత్రం కల్పించవు సుమా! ఎంతవిన్నా, తనివితీరనటువంటి వైకుంఠుని లీలా విశేషాలవి. భక్తి ప్రపత్తులతో మీరు అడగాలేగాని మాగురువుగారు నాకు ప్రసాదించినటువంటి శక్త్యానుసారము వివరిస్తాను వినండి”, అని, స్కాందపురాణంలో జనకమహారాజుకి వశిష్ఠులవారెలా ఈ కార్తీక మహత్యాన్ని బోధనచేశారో, అదేవిధంగా మనకి పద్మ పురాణంలో సత్యభామకి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణపరమాత్మ ఈ కార్తీకమాసవిశేషాలన్నీ కూడా చెప్పారు.
ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత పుష్పాన్నితెచ్చి, కృష్ణుడుకిచ్చి, “ఓ శ్రీహరీ! నీకున్నటువంటి భార్యలలో నీకు అత్యంత ప్రియమైనటువంటి ఆమెకి ఈపువ్వు ఇయ్యవయ్యా”, అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. కృష్ణపరమాత్మ ఆ పువ్వుని రుక్మిణికి కానుకచేశారు. ఆసంగతి తెలిసి సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే నాకివ్వాలిగాని, ఆ రుక్మిణికియ్యడ మేమిటి అని ఆవిడకి కోపం. కృష్ణుడు పాపం ఎంత నచ్చచెప్పినా, ఆవిడ వినిపించుకోలేదు. “పారిజాత వృక్షాన్ని తెచ్చి నాపెరట్లో నాటే దాకా ఊరుకునేది లేదు”, అని ఆయన్ని బెదిరించింది కూడా. మనకీ ఈ విషయమంతా తెలుసు. కృష్ణునికి అత్యంత ప్రియురాలైనటువంటి ఆమెకోరిక తీర్చడమే ప్రధానంగా తలచే అనంతపద్మనాభుడు తక్షణమే అమరావతి నగరానికి వెళ్ళాడు. వెళ్లి ఆ పారిజాత వృక్షాన్ని తనకిమ్మని కోరాడు. అయితే స్వర్గసంపదను భూలోకానికి పంపించేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా వారిద్దరిమధ్య ఒక ఘోరమైనటువంటి యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో చివరికి దేవేంద్రుడే తగ్గవలసిన పరిస్థితి వచ్చి (వివరంగా వ్యాఖ్యానించేంత సమయంలేదు) దేవేంద్రుడే తగ్గి సవినయంగా పారిజాతధృమాన్ని యాదవేంద్రుడికి అప్పగించాడు. ఆ యాదవేంద్రుడు దాన్ని తెచ్చి తన భార్యయినటువంటి సాత్రాజితికి (సాత్రాజితి అంటారు సత్యభామని సత్రాజిత్ కుమార్తె కనక) ఆమె ఇంట్లో ప్రతిష్ట చేశాడు. పరమానంద భరితురాలైనది సత్యభామ. అయి, “నేనెంతటి ధన్యురాలిని. నీకింతమంది భార్యలుంటే నామీద మిక్కిలిప్రేమ నీకుండటంవల్ల ఈజన్మలో నేననుకున్నవన్నీ కూడాను నువ్వు సాధించిపెడుతున్నావు. ఎవ్వరూ, ఎప్పుడూ కళ్లారా కూడా చూసి ఎరుగని పారిజాత వృక్షం నా పెరట్లో మొక్కగా ఉండటానికి కారణం ఏమిటి, కృష్ణా? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారబోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను పాదాన తాడించినా (అంటే కాలితో ఒకసారి ఆవిడ తోసినట్టుగా తెలుసుకుంటాం. ఈ వివరాలన్నీ మళ్ళీ ఇంకో సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం). కానీ నీవుమాత్రం నామీద నువ్వుగింజంత కూడా కోపగించుకోకుండా ఇలా ప్రేమ చూపిస్తున్నావంటే ఈ ఆదరాభిమానాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యమేదో ఉండి ఉంటుంది. లేకపోతే ఇది సాధారణంగా లభించేటటువంటిది కాదుకదా! ఏమిటి ఆ పుణ్యం, చెప్పవలసింది”, అని ఆవిడ కోరింది కృష్ణపరమాత్మని. సత్యభామ కృష్ణుడిని కోరింది.
అందుకు ఆ ముకుందుడు మందహాసం చేస్తూ, “ఓ నారీలలామా, సత్యభామా! నీవునన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరానిదానిని ఆశించి కోరినా కూడా, నీ సమస్త వాంఛలనూ నెరవేర్చి సంతృప్తురాలును చేయటమే నావిధి. అందుకు కారణం నీపూర్వజన్మే సుమా! పూర్వం మాయ అనే ఒక నగరం ఉండేది. అందులో దేవశర్మ అనేటటువంటి వేదపండితుడు ఉండేవాడు. ఆయనకి ‘గుణవతి’ అనేటటువంటి ఆడబిడ్డ కలిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆపిల్లని ఆయన శిష్యులలోని ఒకడైనటువంటి ‘చంద్రుడు’ అనేటటువంటివానికిచ్చి వివాహం జరిపించాడు. ఒకరోజు ఆ మామా అల్లుళ్లిద్దరూ కలిసి సమిధలూ, దర్బలు తెద్దామని అడివికి వెళ్లారు. అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. అయితే, బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్యసూర్యోపస్థానులు అయిన మెచ్చి, విష్ణుమూర్తి వారిని విష్ణులోకానికి తీసుకుని వెళ్ళవలసినదని తనభటులని ఆజ్ఞాపించారు. ప్రభువాజ్ఞను వారు పాటించి, సూర్యతేజస్సులీను కాంతులతో ఆ ఇరువురనీ వైకుంఠాపురానికి జేర్చారు.
అయితే, ఇంట్లోఉన్నటువంటి గుణవతి తనకున్నటువంటి వస్తువులన్నింటినీ అమ్మి, తండ్రికీ, భర్తకూ ఉత్తమగతులు ప్రాప్తించవలసిందిగా కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని ఆ శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్ధం కూలిపనులు చేసుకుంటూ, ఆధ్యాత్మికచింతనమాత్రం వదలిపెట్టక హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్నీ, ఇత్యాదులన్నీ పాటిస్తూ కార్తీక వ్రతాన్నీ, ఏకాదశి వ్రతాన్నీ మాత్రం ప్రతియేటా విడవకుండా ఆచరించేది. పుణ్యగుణాలు, భుక్తిముక్తిదాయకాలు అయినటువంటి ఆ రెండు వ్రతాలు నాకత్యంత ప్రీతిపాత్రమైనవి. ఆసంగతి నీకుతెలుసుకదా, సత్యా! ఈమాసంలో నిత్యమూ ప్రాతః స్నానమాచరించేవారి సమస్త పాపాలనూ నేను నశింపజేస్తాను. ఈకార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసిపూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠ వాసులైన శ్రీమహావిష్ణుస్వరూపులై భాసిస్తారు. పూజ, పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు. నెలరోజుల్లో కనీసం మూడురోజులైనా ఆచరిస్తే, దేవతలైనా నమస్కరిస్తుంటారు అటువంటి వారిని. అంతటి పుణ్యాత్ములవుతారు. ఆవిధంగా ఆనాడు గుణవతి విష్ణుప్రియమైనటువంటి ఏకాదశి, కార్తీక వ్రతాలనుమాత్రం వదలకుండా ఆచరిస్తూ, వయోభారంచేత శరీరాన్ని త్యజించి, విష్ణుదూతలచేత విష్ణులోకమునకు చేర్చబడినది. అదుగో, ఆతరువాత దేవతల ప్రార్థన మీద శ్రీమహావిష్ణువైన నేను ఇలా కృష్ణునిగా జన్మించాను. నాతోబాటు అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని ‘చంద్రుడు’ ఈజన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా పుట్టాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీదా, నామీద మాత్రమే మనసు లగ్నంచేసిన గుణవతే నీవు. అంటే సత్యభామవు. ఈ జన్మలో వైభోగానికంతటికూ కారణం పూర్వజన్మలో కార్తీక వ్రతాచరణ పుణ్యమే తప్ప మరే ఇతర విషయమూ కాదు. ఆ జన్మలో నాముంగిట తులసిమొక్కను పాతిన పుణ్యానికి ఈజన్మలో కల్పవృక్షం నీవాకిట వెలసింది సత్యా! ఆనాడు నీ సమస్తవ్రతాల పుణ్యాలన్నీకూడా ఈరోజు భోగభాగ్యాలుగా నీకందుతున్నాయి. జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నాభార్యవయ్యావు. నువ్వేకాదు, ఈమాదిరిగా ఎవ్వరైతే కార్తీక వ్రతానుష్టాన నిష్టలో నా భక్తులుగా ఉంటూ, నాకు సమర్పిస్తూ ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై, సర్వకాల సర్వావస్థలలోనూ నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు. ఒక రహస్యం చెప్తాను విను. తపో దాన యజ్ఞాదులన్నిటినీ నిర్వర్తించినవారైనా సరే, కార్తీకవ్రతం చేసినవారికి లభించే పుణ్యంలో పదహారవ వంతు పుణ్యమే లభిస్తుంది అని తెలుసుకో, అని కృష్ణపరమాత్మ సత్యభామకు చెప్పడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది.
మరుసటి రోజు మళ్ళీ తరువాతి అధ్యాయంతో కలుద్దాం.
ధర్మస్య విజయోస్తు.
Karthika Puranam – Day 16:
Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam
In the holy month of Kartika, let’s listen to the epic Kartika Purana, the 16th Day of Kaartheeka Maasam.
The batch of Maharshis led by Souwnaka Maharshi were satisfied by listening to the Kaartheeka Purana Mahaathyam contained in Skaanda PuraaNam. They praised him and further requested, “It seems narratives of Kaartheeka PuraaNam which gives the highest punyam in this world are available not merely in Skaanda PuraaNam but also in Padma PuraaNam. Kindly explain that also to us”. Sootha Maharshi smiled and said, “The divine playful acts of Vishnu give great punyam to those who listen to it and also to the narrator. Also they never make you feel bored even when told extensively. When you ask me with so much devotion to narrate them, how can I not do so? I will do it to the best of my ability as blessed by my guru. Just as sage Vashishtha taught King Janaka the effect of Kaartheeka Puranam as given in Skaanda PuraaNam, in a similar manner Sri Krishna who is none other than Sree Mahaa Vishnu explained the speciality of Kartheeka Masam to Sathyabhaama and this is included in Padma PuraaNam.
Once sage Narada brought a Night Jasmine flower from Heaven, gave it to Krishna and said, “Srihari, give this flower to whoever of your wives is dearest to you.” Rukmini was present there and Krishna presented it to her. When Sathyabhaama came to know this she was highly offended since she considered herself to be the one Krishna loved most. She would not listen to any amount of pleadings by Krishna. “I will not keep quiet until you bring the entire Night Jasmine tree and plant it here in my garden”, she warned him. This is a very popular story and we are all aware of this episode. Since Krishna’s policy was to satisfy every wish of Sathyabhaama, he immediately went to Amaraavathi and asked Indra to give him the tree. However Indra refused to send the wealth of Heaven to Earth. Hence a fierce battle took place between the two (the details take too much time to describe). Finally Indra had to concede defeat and respectfully presented Krishna the Night Jasmine tree. Krishna brought that tree and planted it in the garden belonging to Saathraajithi (Sathyabhaamaa’s another name since she is the daughter of Sathraajith). Sathyabhaama was extremely happy and said, “I am very fortunate. Among so many wives of yours, you love me most. And so you are fulfilling for me whatever I want in this life. The night jasmine tree which no one on earth has even seen is today in my garden. Krishna, what is the reason for this? I gifted you to Naarada at the time of tulaabhaaram (weighing a person against some commodity); pushed you away with my foot (we can discuss this in more detail in future), and so on. In spite of such misdeeds of mine you don’t have even an iota of anger. On the other hand you love me a lot. In order to deserve such love from you, I must have done some good deeds in my previous births. What is that punyam I have done? Please tell me Krishna. I ask this because this kind of love is not commonly available to everybody”.
Mukunda smiled and said, “Sathyabhaama, the beautiful woman! Even if you ask me to fetch that which should not be fetched, ask the unmentionable, expect what should not be gifted, my responsibility is to fulfill all your desires and make you satisfied. The only reason for this is your previous life. Once a pandit by name Devasarma lived in a town by name Maaya. He was blessed with a daughter by name GuNavathi. After bringing her up with great affection he gave her in marriage to a student of his by name Chandra. One day Devasarma and son-in-law went to a nearby forest to collect firewood and other materials to conduct the fire ritual. They were killed by a raakshasa. Since they were traditional brahmins leading a dhaarmik life and offering water ritual to sun god every day, Vishnu asked his messengers to take them to Vishnu Loka. Accordingly they arrived in Vaikunttam glowing like the Sun.
GuNavathi who was at home sold all her articles and performed the last rites for her husband and father so that they could attain upper Lokas. She spent the rest of her life chanting the name of Seshasai (one who sleeps on the snake). In order to feed her body, she worked as a labourer, but she never discarded spiritualistic practices. She was following the path of devotion to Hari, truthfulness, peaceful existence, etc.. Most importantly, she was observing without fail, Kaartheeka maasa vratham and Ekaadasi vratam every year. Sathyaa, you are aware that these two vrathams are most pleasing to me because they bestow good qualities, livelihood and liberation. I cancel the sins of those who take an early morning bath every day of this month. Those who perform in this Kaartheeka maasam the following four: bath, lighting a lamp, pooja to Tulasi, and all-night wakefulness will, at the end of their life, reside in Vaikuntham and will glow with the form of SreemahaavishNu. Those who do prayer and the connected rituals get liberation from the cycle of birth-death-birth. Those who perform this for at least three days out of the one month will become virtuous souls and will be worshipped even by devas themselves. GuNavathi observed Ekaadasi vratham as well as Kaartheeka Vratham and after reaching old age, left her body. She was escorted to Vaikunttam by the messengers of Vishnu. Subsequently, on the request of Devas, I took birth as Krishna. Along with me, a number of residents of Vaikunttam took birth as yaadavaas. Chandraa of previous birth has come down as Akroora, Devasarma is now King Sathraajith. GuNavathi who concentrated only on Kaartheeka Vratham and on me is now none other than yourself, Sathyabhaama. The only reason for all your present wealth is the result of Kaartheeka Vrathams performed by you in previous life. By virtue of your planting a Thulasi (Basil) plant in front of me in your previous birth you became eligible for the divine Night Jasmine plant getting transplanted in your house. The sum total of all your sacred practices have resulted in the splendour you are seeing now. Since you surrendered the punyam of all your religious practices to me, the lord of the universe, you are now my wife. Not just you alone, anyone who observes these holy practices and submits their fruits to me will be taken care of at all times by me and will enjoy my company. I’ll tell you a secret. Even those who have conducted penance, donation, fire ritual, and so on are eligible to receive only one-sixteenth the puNyam that a person who observes Kaartheeka Maasa Vratham gets.”
This Chapter closes with this discourse of KrishNa to Sathyabhaama. We will meet tomorrow with another Chapter.
Dharmasya Vijayosthu!