Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
Menu
  • Home
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
  • Activity
    • Events
    • Classes
    • Services
  • About us
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 9

Shiva Lingam decorated with glowing diyas for Karthika Puranam Day 7 — Hindu festival image symbolizing devotion to Lord Shiva during the sacred month of Karthika.

కార్తీక పురాణము తొమ్మిదవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

కార్తీక పురాణంలో తొమ్మిదో రోజు పారాయణ అంశము ఈరోజు మనం విన్దాం.

నిన్నటి రోజు మీకు మనవి చేశాను స్తంభాల్లోంచి  ఉద్భవించినటువంటి పురుషుడు మతంగమని ఆశ్రమంలో ఉన్నటువంటి అంగరసి మహాముని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెప్తున్నారు అంగీరస మహాముని :

कर्मबन्धश्च मुक्तिश्च कार्यं कारणमेव च।
स्थूलसूक्ष्मं तथाद्वन्द्वं सम्बन्धो देहमुच्यते॥

కర్మ బంధస్చ ముక్తిస్ఛ కార్యం కారణమేవచ

స్థూల సూక్ష్మమ్ తథాద్వాంద్వా సంబందొ దేవ ముస్చాతే

అంటే కర్మబంధము, ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఇవన్నీ కూడా దేహ సంబంధమే అవుతాయి.

अत्र ब्रूमः समाधानं समाधानं कोऽन्यजीवस् त्वमेव हि।
स्वयं पृच्छसि मां कोऽहं ब्रह्मैव त्वमिति संशयः॥

అత్ర బృమః సమాదానం సమాదానం కొऽన్యజీవస్వమేవ హి |

స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవ త్వం ఇతి సంశయః ||

అంటే ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న ముందు అడిగి ఉన్నాడు __జీవి ఎవరు? దేహి ఎవరు? అని జీవుడంటే వేరెవరో కాడు నీవే …అప్పుడు నేను ఎవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నీకు సమాధానం వస్తుంది నేనే బ్రహ్మనై ఉన్నాను అనే సమాధానం వస్తుంది అనగానే ఆ పురుషుడు అన్నాడు అంగీరసం మహర్షి మీరు చెప్పిన అఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు అంటే అర్థం కావడం లేదు అని అర్థం. నేను బ్రహ్మని అనుకోడానికి బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఈ పదార్థ జ్ఞానం కూడా లేని వాడినై నేను ఎలా తెలుసుకుంటాను కొంచెం వివరించి చెప్పండి అని అడిగారు. అడగ్గానే అంగీరస మహర్షి చెప్తున్నారు__ ఇక్కడ చాలా లోతయినటువంటి వేదాంత తత్వ విషయాలను ఆత్మతత్వాన్ని బోధిస్తూ మహర్షి మనకు అందించారు. దాన్ని మీకు సులువుగా, తేలికగా అందించే ప్రయత్నం చేస్తాను.

ప్రశ్నించుకోవలసింది ఎవరికి వారు _ ఈ శరీరము వేరు ఆత్మ వేరు. నేను అంటే ఎవరికి వారు Who Am I? అని ప్రశ్నించుకోండి అని రమణ మహర్షి చెప్పేవారు నేను అంటే ఎవరు ఏదో పేరు చెప్తాం ఆ పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వారే గనుక ఇంకొక పేరు పెట్టుంటే అది నేను కాదు ఇప్పుడు మనం నా చేయి, నాకాలు, నాకన్ను, నానోరు నా చెవి, నా ముక్కు అంటున్నాం కాబట్టి నాది అనేది వేరు నేను అనేది వేరు. నా ఇల్లు నా కారు అవి వేరు నేను వేరు. నా ఇల్లు నేను kadu na కారు నేను కాదు కాదు అలాగే నా చెయ్యి నేను కాదు నా కాలు నేను కాదు అప్పుడు దేహము నేను కాదు నేను దేహం కానప్పుడు మరి నేనెవరు అందువల్ల ఈ దేహానికి సంబంధం లేనటువంటి విషయము ఆ నేను అనేటువంటి పదార్థము అదే బ్రహ్మ “అహం బ్రహ్మాస్మి” అనేటువంటి తత్వ వాక్యము అక్కడ నుంచి ప్రారంభమైంది. ఈ విచారణ చెయ్యాలి కాబట్టి ఆ ఆత్మ అనేటువంటి బ్రహ్మాస్వరూపము లోపల ఏదైతే ఉన్నదో ఈ శరీరం లోపల పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము జీవి భూమి మీదకు వచ్చేటప్పుడు తల్లి గర్భంలో తయారు చేసుకొని వచ్చాడు. వచ్చి ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లుగా కొంతకాలం అద్దెకు ఉంటాడు ఉండి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు.

దేహినోస్మీన్ యాదదేహే కౌమారం యవ్వనం జర తథ దేహంత ప్రాప్తిహి ధీరాస్తత్ర న ముశ్చతే

అంటారు కృష్ణ పరమత్ములు భగవద్గీతలో

అంటే పుట్టినటువంటి పిల్లవాడు పెరుగుతాడు యవ్వనంలోకి వస్తాడు వివాహం చేసుకుంటాడు ఇంకొంచం పెద్దవాడవుతాడు ఆ తర్వాత ముసలివాడు అవుతాడు ఆ తర్వాత పడిపోతాడు.

దీనినే షడివికరాలు అన్నది శాస్త్రం. చరితత్వ అస్థిత్వ, వృధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ నాసంగత్వ

అంటే ముందు పొడుతుంది జీవి ఒక శరీరాన్ని ధరించి తల్లి గర్భం నుండి పుడతాడు _ పుట్టి అస్తిత్వ అంటే ఉన్నాడు ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి పుట్టినప్పటి నుంచీ కొద్ది కాలం గా ఉంటాడు . పుట్టిన ప్రతి వస్తువు కూడా అలాగే ఉంటుంది అక్కడి నుంచి వృద్ధిగతత్వ అంటే పెరుగుతూ ఉంటాడు ఒక అడుగున ఉన్నటువంటి పసిపిల్లవాడు ఆరడుగుల పొడుగు పరుగుతాడు అలా పెరుగుతూ ఈ వృధిలో భాగంగా పరిణామం చెందుతాడు చిన్నచిన్న వేళ్ళు చిన్న చిన్న గోళ్ళు చిన్నచిన్న చేతులు చిన్న చిన్న కాళ్ళు నటువంటి వాడు పెద్ద పెద్ద చేతులు పెద్దపెద్ద కాళ్లతో తయారవుతాడు అంటే మార్పు వస్తున్నది మనసులో కూడా మార్పు వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది శరీరంలో మార్పు వస్తుంది ప్రతి దాంట్లో కూడా మార్పు సహజంగా వస్తుంది అది పరిణామత్వ లక్షణం ఇంకా తర్వాత ఒక 60 సంవత్సరాలు వచ్చినప్పుడి నుంచి

గాత్రం వ్యాకుచితం  గతిర్విగళితాహం బ్రాస్టాచ దంతావళిహి అని క్షీణత్వ దశ ప్రారంభం అవుతుంది ఒక్కొకటి అవయవాలు, శరీరము జర్జరి భూతం అయిపోతూ ఉంటుంది వృద్ధాప్యం ఆవహిస్తుంది శక్తి నశిస్తూ ఉంటుంది ఆ తర్వాత నాశనమైపోతుంది ఒకేసారి పడిపోతుంది.

దీన్నే షెడ్వికారాలు అన్నారు ఈ షెడ్వికారాలు శరీరానికే గాని ఆత్మకు కాదు ఆత్మ నీవై ఉన్నావు శరీరం నీవు కాదు అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం పొందడం. అందువల్ల ఆ బ్రహ్మనే నేనని గుర్తించినటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లే.

అహం బ్రహ్మాస్మి అనే శబ్దానికి సూక్ష్మంగా ఈ అర్థాన్ని మనకి పెద్దలు బోధించారు అయితే సమదమాది సాధాన సంపత్తితో గాని శ్రవణ మననాది భక్తి మార్గంలో గాని వెళ్తే తప్ప ఇది గోచారము అవ్వదు ఇది శృతి వల్లనో అంటే వేదము చెప్పినటువంటి మార్గమును విని మననము చేసుకొని విచారణ చేసి తద్వారా ఆలోచన చేసి నడిచేటువంటి వారికి లేదా గురు కటాక్షం వల్లనో ఈ బోధ స్థిరపడుతుంది. అప్పుడు ఈ సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది

అయినా కొంత కాలం ఆ ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది కొంతమంది విషయంలో అదికూడా అక్షయమవడంతో పునరావృతి రహితమైనటు వవంటి స్థాయినీ జీవి చేరాగలుగుతాడు. కాబట్టి దీనినే ముక్తి, మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా ఉండి, కర్మ ఫలాన్ని దైవర్పణం చేస్తుండడం దాని  వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఈ జన్మలో గాని లేదా ప్రార్థన బలం అధికం అయితే మరుజన్మలోనైనా మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మ బంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. అందువల్ల నాయన నీవు ముక్తినిచే మార్గము నీకు త్యాగకర్మలే అంటే త్యాగం చేసేటువంటి కర్మలు కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తే అది ముక్తి వైపు వేడుతుంది అని ఆయనకు సమాధానం చెప్పడంతో కర్మయోగం వివరించండి అని అడిగారు ఆ పురుషుడు అంగీరసుడినీ. అపుడు సకాలంలో

స్నానే రహితం కర్మాః హస్తిభుక్త కపిదవత్ప్రాతః స్నానం ద్విజా దీనం శాస్త్రం చ అస్తు దిజోదితం

సకలం లో చేయవలసిన సమయంలో చేయవలసినటువంటి కార్యమే కర్మ.

చేసినటువంటి కర్మకు ఫలితం ఆశించకుండా దాన్ని వదిలిపెట్టి కర్మ ఫలితాన్ని శ్రీహరికి అర్పించి చేస్తూ ఉండడమే కర్మ అని అంగీరసుడు సమాధానం చెప్పగా అక్కడితో ఈ అధ్యాయం పూర్తవుతుంది మనకు.

రేపు దశమినాడు గుమ్మడికాయని విసరజించాలి, అన్య పతార్థాలు వాడకండి ఉసిరికాయ విసర్జించండి గుమ్మడికాయ దానం చేయవచ్చు స్వయంపాకం ఇవ్వవచ్చు ఎవరున్నా తీసుకుంటే నూనె దానం చేయవచ్చు దానివల్ల యశస్సు, ధనలబ్ది రెండు చేకూరతాయి. అష్టదిక్పజాలను ప్రార్ధిస్తే ఈ రోజు విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది.

ధర్మస్య విజయోస్తు.

Namah Shivābhyām Nava Yauvanābhyām Namo Namah Shankara Pārvatībhyām!

Salutations to Lord Shiva and Goddess Parvati, who are ever youthful.

Let us now listen to the topic of the ninth day’s recitation from the Karthika Purana.

Yesterday, we heard that a sage named Angirasa Maharshi, who was in the hermitage of Matanga, asked several questions to the sage Angiras. To answer those questions, Angiras Maharshi said:

श्लोकः

कर्मबन्धश्च मुक्तिश्च कार्यं कारणमेव च ।
स्थूलसूक्ष्मं तथाद्वन्द्वं सम्बन्धो देहमुच्यते ॥

Transliteration

Karma bandhascha muktischa kāryam kāraṇam eva cha

Sthoola sookshmam tathādvandvam sambandho deha-muchyate.

This means that bondage through karma, liberation, cause and effect, the gross and the subtle — all are related to the body.

He continued:

श्लोकः

अत्र ब्रूमः समाधानं समाधानं कोऽन्यजीवस् त्वमेव हि ।
स्वयं पृच्छसि मां कोऽहं ब्रह्मैव त्वमिति संशयः ॥

Transliteration

Atra brūmaḥ samādānaṁ samādānaṁ ko’nyajīvas tvam eva hi |
Svaya
ṁ pṛcchasi māṁ ko’ham brahmaiva tvam iti saṁśayaḥ ||

It means — everyone should first ask themselves: Who am I? Who is the embodied being?

The living being is none other than yourself. If you truly ask yourself, Who am I?, the answer will arise within you — I am Brahman (the Supreme Reality). When Angiras Maharshi said this, the man listening replied, “O sage! I am unable to fully understand this profound teaching. If I am to consider myself Brahman, I must first know what Brahman means. Without understanding that, how can I realize it? Please explain more clearly.”

Then Angiras Maharshi began to explain in depth the Vedantic truth of the Self (Ātma Tattva) in a simple and understandable way:

The Question to Ask: Who Am I?

Each person must question: “This body is one thing; the soul is another. Who am I?” As Sri Ramana Maharshi also taught, we must ask: Who am I? We often identify with names given by parents — but those names are not truly “me.” We say my hand, my leg, my eyes, my mouth, my ear, my nose. The very word my shows that these are possessions, not the possessor. Similarly, my house, my car — these are separate from me. If my hand and leg are “mine,” they are not “me.” Therefore, I am not the body.

So, what am I?

That which exists apart from the body — that awareness — is the Self, the Brahman.

This realization is expressed in the Mahāvākya (great saying):

अहं ब्रह्मास्मि ||

Aham Brahmāsmi

“I am Brahman.”

When a living being comes to earth, he enters his mother’s womb and forms his body from the five elements. He resides in this body for a time, like living in a rented house, and then leaves it when the time comes.

As Lord Krishna says in the Bhagavad Gita, Chapter 2, Verse 13

Sanskrit:

देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥ १३ ॥

Transliteration:

Dehino ’smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir dhīras tatra na muhyati.

Just as childhood, youth, and old age come to the body, so too does death — and the wise are not deluded by this change.

The Six Transformations (Ṣaḍ-vikāras)

Scriptures speak of six natural changes that occur only to the body, not to the soul:

1. Jayate – Birth

2. Asti – Existence

3. Vardhate – Growth

4. Viparinamate – Transformation

5. Apakṣīyate – Decay

6. Nashyati – Death

The soul never undergoes these transformations — only the body does. Therefore, realizing I am not the body; I am the immortal Self (Ātman) is true Brahma Jñāna (knowledge of the Absolute). The one who realizes this becomes liberated. Path to Liberation (Moksha). This knowledge is not easily attained. It is realized only through:

Purity of mind (Chitta Shuddhi) through selfless action, Listening (Śravaṇa) and Contemplation (Manana) on the teachings of the Vedas, Or through the grace of a Guru. When this nderstanding becomes steady, worldly attachments dissolve by themselves. Even then, some Prarabdha Karma (past karma) continues to affect the body for a while, until it is exhausted. When all karmas are exhausted, one attains a state of complete liberation — Moksha.

Hence, selfless action (Karma Yoga) is the path. Performing work without attachment to its fruits and offering the results to the Divine leads to liberation. When the seeker asked Angiras Maharshi to explain Karma Yoga, the sage replied.

Sanskrit (corrected and standardized):

स्नाने रहितं कर्माह हस्तिभुक्तं कपिवद् भवेत्।
प्रातःस्नानं द्विजादीनाम् शास्त्रं चास्ति द्विजोदितम्॥

Transliteration:

Snāne rahitaṁ karmāhā hastibhuktaṁ kapivad bhavet,
Prāta
ḥ snānaṁ dvijādīnāṁ śāstraṁ cāsti dvijoditam.

Karma means doing the right duty at the right time, as prescribed by the scriptures — without expecting the fruits of that action, offering them to Lord Vishnu or Hari.

Thus ends the ninth-day chapter of the Karthika Purana.

Instructions for the tenth day:

Break the pumpkin (gummadi kaya visarjana).

Avoid using other items like gooseberries (usirikaya).

You may donate a pumpkin or give self-prepared food (swayam pakam) to others.

Offering oil in charity is also meritorious.

Doing so brings both fame and prosperity. Praying to the Ashta Dikpalakas (the eight directional deities) today yields special spiritual benefit.

Dharmasya Vijayostu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy