Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
Menu
  • Home
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
  • Activity
    • Events
    • Classes
    • Services
  • About us
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 7

Shiva Lingam decorated with glowing diyas for Karthika Puranam Day 7 — Hindu festival image symbolizing devotion to Lord Shiva during the sacred month of Karthika.

కార్తీక పురాణము ఏడవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

ఈ రోజు కార్తీక మాసంలో సప్తమి తిథి. ఈ రోజు ఏకాదశ అధ్యాయం ఒక సారి విందాం…

వశిష్ఠులవారు జనక మహారాజు గారికి చెబుతున్న, ఈ కార్తీక పురాణం స్కాంద పురాణ అంతర్గతంగా, జనక మహారాజుతో, “రాజా, ఎంత చెప్పినా తరగని కార్తీక మహత్యము, కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మాలను చెబుతున్నాను, ఏకాగ్ర చిత్తుడవయి నీవు కూడా వింటున్నావు. నా తండ్రి అయినటువంటి బ్రహ్మ దేవుడి ద్వార నాకు బోధింపబడ్డాయి. అంటే చేయవలసిన పనులు చేయకపోతే, చయకూడని పనులు చేస్తే, ఉండేటువంతి ప్రమాదాలు తెలుసుకుని మానవుడు, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నాన, విద్యా దాన, వస్త్ర దాన, అన్నదానాలు కాకుండా, ఉపనయన అర్హత కలిగిన వారికి ఉపనయనం చేయించుట కూడ విశేషమైన పుణ్య ఫలం.

ధనం చేత పేదవాడు, గుణం చేత Yఓగ్యుదౌ అయినటువంటి వాడిని చూసి, కార్తీక మాసంలో ఈ పిల్లవాడికి ఉపనయనం చేయిస్తాను అని సంకల్పం చేసుకుని,

మాఘ్యం వై మాధవే మాసి చోత్తమం మౌంజీ బంధనం |
కారయిష్యంతి తే రాజన్ దానం దత్త్వాతు కార్తికే ||

అని కార్తీకంలో ఉపనయన దానసంకల్పం చేసి, తదనంతరం మాఘమో వైశాఖమో వచ్చినపుడు ఉపనయనం జరిపించాలి. సద్గుణపూర్ణులైన శ్రోత్రియ బ్రాహ్మణబాలకులకు ఉపనయనం చేయించుట అనంతపుణ్యదాయకమని ధర్మజ్ఞ మునులు ప్రసిద్ధముగా ప్రతిపాదించారు. 

ఇతరుల ధనంతో తీర్థయాత్రలు చేయడం, దేవబ్రాహ్మణార్చనలు చేయడం వలన కలుగు పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది-ఇది జగజ్జనిత విషయమే కదా! అట్లే, కార్తికంలో తమ సంపాద్యంతో బ్రాహ్మణునికి ఉపనయనంతోపాటు వివాహం జరిపించగలిగితే పుణ్యవృద్ధి మరింత పరాకాష్ట చేరుతుంది.

కన్యాదానం తు కార్తిక్యం యః కుర్యాద్భక్తితో నఘః |
స్వయంపాపైర్వినిర్ముక్తః పితృణాం బ్రహ్మణః పదమ్ ||

కార్తీకంలో  భక్తితో కన్యాదానం చేసిన వాడు స్వపాప విముక్తుడై తానే కాదు, తన పితృవర్గాన్నికూడా బ్రహ్మలోకానికి అధిరోహింపజేస్తాడు. కాబట్టి ఓ జనకమహారాజా, దుర్మార్గుడైనటువంటి సువీరుడని ఒక రాజు ఉండేవాడు. దైవ యోగం వలన, ఆ సువీరుడు, దాయాదులచే ఓడింపబడి రాజ్య భ్రష్టుడై, అర్థాంగి అయినటువంటి సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి, కంద మూలాలు భుజిస్తూ జీవనం సాగించే వాడు. కొంత కాలానికి ఆయన భార్య గర్భవతి అయింది. నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించుకుని, అక్కడ ఆ రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలను శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కంద మూలాలతో బ్రతుకుతున్న ఈ రోజులలో, కడుపు పండి సంతానం పండడం, పోషణకు చిల్లి గవ్వ అయిన లేని దారిద్ర్యం, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ, తన పురాకృత కర్మలను నిందించుకుంటూ, అతి కష్టం మీద ఆ కుమార్తెను పెంచుకోసాగారు సువీర దంపతులు.

కాలం ఆగదు కదా! కొంత కాలానికి, ఆ కన్యకు వివాహ వయసొచ్చింది. ఆ కన్యను ఒక చక్కని యువకుడు తనకిచ్చి పెండ్లి చేయవలసినదిగా కోరాడు. అందుకు, ఈ రాజు, ‘నేను ఘోర దరిద్రములో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు నాకు కన్యాశుల్కంగా నాకు సమర్పించ గలిగితే నీకు వివాహం చేస్తానూ, అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ఆ మనిషి, కోరినంత ధనము అప్పజెప్పి, ఆ కన్యను వివాహం ఆడాడు.

ఇతను ఇచ్చిన కన్యాశుల్కంతో సువీరుడు జీవనం ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. కొంత కాలానికి, ఈయన భార్య గర్భవతి అయినది, మల్లీ ఇంకో కుమార్తె కలిగింది. ఈ లోపల అటుగా వచ్చిన ఒక మహర్షి, ఈయన చెప్పిన విషయం తెలుసుకుని, ఆస్చర్య పోతూ

కన్యాద్రవ్యేణ యో జీవేత్ అసిపత్రం స గచ్ఛతి |
దేవానృషీన్ పితౄంచాపి కన్యాద్రవ్యేణ తర్పయేత్ |
శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మాన్యపుత్రతామ్ ॥

కాబట్టి ఓ రాజా! కన్యా విక్రయ ధనంతో జీవించినవాడు మరణానంతరం అసిపత్రవన నరకానికే పడతాడు! ఆ ధనంతో దేవ,ఋషి-పితృ తర్పణాలు చేసినా వారికీ నరకదుఃఖమే భాగ్యం, పైగా కర్తకు జన్మజన్మాలపాటు పుత్రలేమి శాపం పడుతుంది. కన్యావిక్రయం వృత్తిగా చేసేవారు రౌరవ నరకంలో నలుగుతారు.

 అన్ని రకాల పాపాలకు ఎవో ఒక ప్రాయశ్చిత్తం ఉన్నాయి, కానీ కన్యాశుల్కం ద్వారా సొమ్ము పోగు చేసుకుని, దానితో జీవనం గడీపితే, ఆ మహా పాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు మహారాజా! అని నీతి వాక్యం చెప్పారు.

బుద్ధి సరిగ్గా లేనప్పుడు, ఎవ్వరు చెప్పినా వినరు, అలాగే ఈ రాజు కూడా, ‘నీకెందుకయ్యా, నీ పని చూసుకో’, అని ఈ రాజు ఆయన్ని పంపించేసాడు.

ఈ ఫలితంగా, శ్రుతకీర్తి అనే రాజు, ఈ సువీరుడి పూర్వీకులలో ఒకడు, సమస్త స్వధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త. అటువంటి ఆ రాజు, తన పుణ్య కార్యాచరణల వల్ల, స్వర్గంలో సుఖ భోగాలు అనుభవిస్తున్నాడు. కానీ, ఈ సువీరుడి పాపాల వల్ల, యముడు ఆయనకు శిక్ష విధించి, యమదూతలు ఆయనను స్వర్గం నుండి నరకానికి తీసుకుని వచారు. ఆస్చర్య పోయిన శ్రుతకీర్తి, యముడిని ప్రశ్నించాదు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని?

శ్రుతకీర్తికి, తన వంశంలోని సువీరుడు చేసిన పాపాల గురించి చెప్పి, నీకు, నీవు వ్యక్తిగతంగా చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల, ఒక దేహాన్ని ఇస్తున్నాను. ఈ దేహంతో, ఆ సువీరుడి రెండవ కుమార్తెకు కనీసం కన్యాదానం చేయించు, శుల్కం లేకుండా, నిశ్శుల్కంగా, అప్పుదు నీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని ఆయన చెప్పడంతో, ఆయన అనుగ్రహం వలన దేహదారియై శ్రుతకీర్తి వెంటనే భూలోకానికి వచ్చెను. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడి భార్యకు హితములు చెప్పి, వారి రెండవ కుమార్తెను సువర్ణాభరణ భూషితురాలు చేయించి ఆ విధంగా కన్యాదానం చేయించాడు. అంతేకాకుండా, పది మంది బ్రహ్మచారులకు కన్యా మూల్యమును ధారపోయడము వలన వారి వారి పితృ, పితామహాది వర్గాలంతా కూడా, విగత పాపులయి స్వర్గాన్ని పొందారు. కన్యామూలాన్ని చెల్లించలేని వారు, వివాహార్తము మాట సహాయము చేసినప్పటికీ కూడా, అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా! కాబట్టీ, ధర్మ సూక్ష్మము అలానే ఉంటుంది. 

మాసమంతా పూర్వోక్త సర్వ ధర్మ సమ్యుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపొయినప్పటికీ, ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో, జన్మాంతర పాపాలు క్షయించిపోతాయి.

వృషోత్సర్గం అంటే, ఆవు యొక్క కోడె దూడను అచ్చుపోసి (ముద్రవేసి) ఆంబోతును స్వేచ్ఛగా తిరగడం కోసం వదలివేయడం. అలాగే, కార్తీక మాసంలో పండ్లను దానం చేసే వాడు దేవ–ఋషి–పితృబంధాలు మూడింటి నుంది కూడా విముక్తుడై పొతాడు.

దక్షినాయుతంగా ధాత్రి ఫలం, అంటే ఉసిరిక ఫలం దానం ఇచ్చే వారు సార్వభౌమత్వాన్ని పొందుతారు. కార్తీక పౌర్ణమి నాడు దీప దానం వలన త్రికరణ కృత పాపలు నశించి పొతాయి. కార్తీక పౌర్ణమినాడు లింగదానం సమస్తపాపహారం, అత్యంత పుణ్యదాయకం!

అలాగే ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలిగ్గా లభ్యమవదు మహారాజా! అత్యంతోత్క్రుష్టమైనటువంటి కార్తీక మాసంలో పరాన్నాభుక్తి, పితృశేషాహారం, నిషిద్ధద్రవ్యాహారం, శ్రాద్ధభోజనం, నువ్వులదానపట్టడం ఈ అయిదూ మానివేయాలి. కార్తీక పౌర్ణమి, అమావాస్యలలో, పిత్రు దినం నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలో, ఇతర నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు, తప్పనిసరిగా ఉపవాస దీక్ష అచరించాలి. ఇలాగ మరికొన్ని నియమాలు మనకు జనక మహారాజుకు చెబుతున్నట్టుగా వశిష్ఠుల వారి ద్వార స్కాంద పురాణానంతర కార్తీక పురాణం నందు వినిపిస్తాయి, కనిపిస్తాయి.

రేపటి రోజు, ఉల్లి, ఉసిరి, మాంసము విసర్జించాలి. యధాశక్తిగా తోచిన దానములు చేయవచ్చు. దుర్గా దేవిని పూజించాలి, ధైర్యము, విజయము మీకు సొంతం అవుతాయి. 

ధర్మస్య విజయోస్తు!

Karthika Puranam – Day 7:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam

Today is Saptami Tithi in the month of Kartika.

Let’s listen to Ekadasa chapter today…

Vasishta Maharshi tells Janaka Maharaja, this Kartika Purana is internal to Skanda Purana, Janaka Maharaja said, “King, no matter how much you say, the greatness of Kartikam is inexhaustible, I am telling you the virtues to be done in the month of Kartikam, you are also listening with concentration. I have been taught by Lord Brahma, who is my father. That is, if you do not do the things that should be done, the things that should not be done, that should be done.” Accidents Knowing that man, in this month of Kartika, apart from Kanyadaana, Pratah Sanna, Vidyaa Daana, Vastra Daana, food donations, performing Upanayanam for those who are eligible for Upanayanam is also a special fruit of merit.

Seeing one who is poor in wealth and Yogya in virtue, resolved to perform Upanayanam to this child in the month of Kartikam.

Maghyam vy Madhave Masi Chottamam Mounji Bandhanam |
karaishyanti te rajan danam dattvathu karthike ||

An Upanayana donation should be made in Kartikam and then Upanayana should be performed when Magha or Vaisakh comes. Dharmajna Munis famously proposed that giving Upanayanam to virtuous Shrotriya Brahmin boys would be infinitely beneficial. 

Pilgrimages with other people’s money, worshiping Deva-Brahman, the merits accrued to those donors – this is a glorious thing, isn’t it! Similarly, if one can marry a Brahmin with Upanayana with their earnings in Kartikam, the merit will reach its peak.

Kanyadaman tu kartikyam yah kuryadbhakti to nagah |
Svayampapirvinirmuktah pitrinam brahmanah padam ||

A person who performs Kanyadaana with devotion in Kartikam not only frees himself but also his family ascends to Brahmaloka. So, O Janakamaharaja, there was a king who was as virtuous as he was wicked. Due to divine yoga, that Suvir, defeated by his cousins ​​and his kingdom corrupted, fled into the forests with Sundarangi, who became Arthangi, and lived by eating kanda roots. After some time his wife became pregnant. Having built Parnasasa on the banks of the Narmada, the queen gave birth to a beautiful daughter there. In these days when all the wealth was stolen by the enemy, he ruled the forests, he was living on the roots of the roots, the stomach was growing and the children were growing, the poverty with no food for nourishment, all these things were repeated and blamed for his ancient deeds, the Suveera couple continued to bring up that daughter with great difficulty.

Time does not stop! After some time, the maiden reached marriageable age. A handsome young man asked the girl to marry him. To this, this king said, ‘Since I am in dire poverty, I will marry you if you can offer me as much money as I want as a dowry. The man, who couldn’t stop loving the child, offered him as much money as he wanted and married the girl.

Suveera is happily living his life with the bride price given by him. After some time, his wife became pregnant and gave birth to another daughter. A sage who came inside was surprised to hear what he had said

Kanyadravyena yo jeevet asiparat sa gachhati |
Devanrsheen Pitachanchapi Kanyadravyena Tarpayet |
Sapan dasyanti te surve janmajanmanyaputratham ॥

So, Oh Raja! He who lives on the money of selling a virgin will go to the hospital hell after death! Even if they make offerings to gods, sages and fathers with that money, they will be blessed with hellish misery, moreover, the doer will be cursed with childlessness along with his births. Those who make a profession of selling virgins will fall in hell.

 There is an atonement for all kinds of sins, but if you accumulate money through dowry and live off it, there is no atonement for that great sin, Maharaja! Says the word of righteousness. When the intellect is not right, no one listens to what is said, and this king also sent him away saying, ‘Why, mind your own business’.

As a result, a king named Srutakirti, one of the ancestors of this great man, was a prophet of all self-righteousness, a hundred-year-old sacrificer. Such a king, because of his pious activities, enjoys the pleasures of heaven. But, due to the sins of this sage, Yama punished him and Yamaduta took him from heaven to hell. Surprised, Srutakirti asked Yama, why did you bring me here?

To Srutakirti, I give a body to you, as a result of your personal merits, telling about the sins committed by the hero of his clan. He said that with this body, give at least the virginity of the second daughter of that Suvir, without tax, without any charge, and then you will have the best of fortunes. He told his wishes to Suvir’s wife, who was there in Parnashala, and made their second daughter a gold-jeweled bhushithura. Moreover, by offering virginity to the ten Brahmacharis, all their paternal and paternal classes, as well as the departed sinners, attained heaven. Those who cannot pay the dowry, even with the help of the married man, will get immense merit, Raja! So, the subtlety of Dharma is like that. 

Even if one does not perform the Kartika Vrata for the whole month with all the above virtues, one who performs Vrishotsargam on the full moon of Kartika, the sins of other births will be eradicated. Vrishotsargam is the molding (stamping) of a cow’s heifer calf and leaving the udder to roam freely. Also, one who donates fruits in the month of Kartika will also be freed from the three bonds of God-Rishi-Pitrubandha.

Dakshinayutanga Dhatri Palam i.e. amla fruit giver gets sovereignty. On the Kartika Poornami, by donating the lamp, the triple sins are destroyed. Lingadanam on the full moon of Kartika is the most auspicious and the most auspicious!

Also this Kartika Vratacharana Sadavakasa is not so easily available to everyone, Maharaja! In the auspicious month of Kartika, these five things should be avoided: Parannabhukti, Pitreshesha food, Nishiddha Vya food, Shraddha Bhojana and taking sesame seeds. Dinner is prohibited on Kartika Purnami, Amavasya, Pitru Day, Sunday, Solar Eclipse and other prohibited days. On the upcoming Ekadashi of this month, fasting initiation must be performed. In this way some other rules are heard and seen in the Kartika Purana after the Skanda Purana by the Vashishtas, as told to us by Janaka Maharaja.

On the next day, onion, amla and meat should be discarded. Donations can be made as needed. Worship Goddess Durga, courage and success will be yours!!!

Dharmasya Vijayosthu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy