Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
Menu
  • Home
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
  • Activity
    • Events
    • Classes
    • Services
  • About us
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 3

Shiva Lingam decorated with glowing diyas for Karthika Puranam Day 3 — Hindu festival image symbolizing devotion to Lord Shiva during the sacred month of Karthika.

కార్తీక పురాణము మూడవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో కార్తీకపురాణము మూడవరోజు పారాయణమైనటువంటి అధ్యాయము ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈకార్తీకపురాణమంతా కూడా జనకమహారాజుకు వశిష్ఠులవారు చెప్పారు. ఆ చెప్తున్నటువంటి ప్రక్రియలో వశిష్ఠులవారంటున్నారు:

“జనకమహారాజా, శ్రద్ధగావిను. మనం చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఈ కార్తీకమాసవ్రతానికి ఉన్నది. కార్తీకమాసంలో విష్ణుసన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో అది, పాము గనక కుబుసాలన్నీ ఎలా తొలగించుకుంటుందో, అలాగ పాపాలని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం భగవద్గీత అంతా చేయలేకపోయినా, 10, 11 అధ్యాయములు పారాయణ చేసేవాళ్ళు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు. అలాగే ఈకార్తీకమాసంలో తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజ చేస్తే, వారు వైకుంఠానికి చేరి సమస్తభోగాలు అనుభవిస్తారు. అలాగే మరొక్క విశేషము: “యఃకార్తికేషితే వనభోజనమాచరేత్ స్వయాతి వైష్ణవం ధామా సర్వపాపైత్ ప్రముచ్యతే” కార్తీకమాసంలో వనభోజనం చేసినవారు (శుక్లపక్షంలో మరీముఖ్యంగా) పాపవిముక్తులవుతారు. జప, హోమ, పూజ, భోజన తర్పణ ఫలాలతో విశేషమైనటువంటి ఫలితమెలా వస్తుందో, అలాగే కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వ్రృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టుకూడా ఉన్నటువంటి తోటలో వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్నిఉంచి గంధపుష్పాదులతో పూజించి అందరూకలిసి భోజనంచేస్తే, కార్తీకమాసంలో వనభోజనం ఇలాఎవరైతే చేస్తారో, వాళ్లు ఆయాకాలాలో చేసిన సర్వపాపాలనుండి విముక్తినిపొంది విష్ణులోకాన్ని పొందుతారు. ఈ కార్తీకమహత్త్యాన్ని భక్తిశ్రద్ధలతో వింటేకూడా అన్నిసంకటాలనుండీ రక్షింపబడతారు. అందుకని కార్తీక పురాణం శ్రద్ధగా వినాలి. అందుకు ఉదాహరణగా మనకి ఇక్కడ దేవదత్తోపాఖ్యానం అనేటటువంటి ఉపాఖ్యానాన్ని జనక మహారాజుకి వశిష్టులవారు వినిపిస్తారు. ఈకార్తీకమాసంలో ముప్ఫయి రోజులు ఎవరైతే మహావిష్ణువును కస్తూరీ గంధాదులతోనూ, పంచామృతాలతోను అభిషేకం చేస్తారో,

శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవ
శివశ్చ హృదయం విష్ణుర్ , విష్ణోశ్చ హృదయం శివమ్

అనేటటువంటి విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం. నేను విష్ణువు అన్నప్పుడు శివుడుకూడా; శివుడు అన్నప్పుడు విష్ణువు కూడా. అదివేదం చెప్తున్నటువంటి అంశం. కనుక ఆవిషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే అభిషేకంచేస్తారో వారికి విశేష అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో (లేదా శివసన్నిధిలో) దీపారాధన చేసినా, దీప దానం చేసినా, వారు స్వయం విష్ణు లోకాన్నే పొందుతారు. పత్తిని శుభ్రపరచి దానితో వత్తినిచేసి బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదనుచేసి, అందులో ఆవునేతినిపోసి ఆవత్తిని వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి చివరిరోజున వెండిప్రమిదలో బంగారువత్తు చేయించి వాటిని బియ్యప్పిండిమధ్యన ఉంచి, పూజాదికాలు పూర్తయిన తరువాత ఆబ్రాహ్మణుడికి భోజనంపెట్టి,

సర్వజ్ఞానప్రదం దీపం, సర్వసంపత్శుభావహం
దీపదానం ప్రదాశ్యామి శాంతిరస్తు సదామమ

అని ఈ శ్లోకం చెప్పుకుని (జ్ఞానమును సంపదను శుభాలనూ కలిగించే దైవదీపదానాన్ని చేస్తున్నాను దీనివల్లనాకు నిరంతరమూ సుఖశాంతి కలుగుగాక ” అనిచెప్పుకుంటూ ఆదీపాన్ని కనక దానంచేస్తే అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటూ వశిష్ఠులవారు ద్రావిడ దేశంలో ఉన్నటువంటి ఒక అనాథ వితంతువు కథ చెప్తున్నారు.

ఈతల్లి వితంతువైనప్పటికీకూడా, ధనమునందు ఆపేక్షవదలలేక డబ్బును వెనకేయటం మొదలుపెట్టింది. అందరిళ్ళల్లో వంటపనులూ, కుట్టుపనులూ ఇత్యాదులు చేస్తూ వారివద్దకొంత ద్రవ్యాన్నితీసుకుంటూ ఆడబ్బుసంపాదించడమే తప్ప ఏనాడూ హరినామస్మరణంచేయడంగాని హరికథనూ పురాణాన్ని వినటంగాని పుణ్యతీర్థాలూ, పుణ్యక్షేత్రాలు దర్శించటంగాని ఏకాదశిఉపవాసంగాని ఏనాడూ చేసి ఎరుగదు. ఇటువంటి వారిని లుభ్ధురాలు అంటారు. పిసినారి అంటాం మనభాషలోచెప్పుకోవాలంటే
ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన ఒకానొక సందర్భంలో ఒక యాత్రికుడు వచ్చాడు. ఆయన తీర్థయాత్ర నిమిత్తమయి వెడుతూవెడుతూ ఆవిడ ఇంటికి వచ్చారు. ఆవిడ పరిస్థితి చూసి జాలిపడి ఈవిడకి నరకం తప్పదనుకొని తోచిన మంచిమాటలు నాలుగు మాటలు చెబ్దామనేటటువంటి ఉద్దేశంతో ఆయన, “ఓ అమాయకురాలా! నేనుచెప్పేది శ్రధ్ధగావిను. ఆలోచించుకో. నిర్ణయంనీదే. చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఈశరీరము, ఇది తోలుశరీరము. ఇది అశాశ్వతమని తెలుసుకో. నేల, నిప్పు, నీరు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము..ఈదేహము నశించగానే ఈ పంచభూతాలు కూడా ఇంటి కప్పు మీద కురిసి, నాలుగువైపులాచెదిరిపోయే వాననీళ్లలాగ చెదిరిపోతాయి. జీవితము శాశ్వతము కాదు.

నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ ।
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ ॥

అని మనకి శంకర భగవద్పాదులవారుకూడా చెప్తారు ఇదేమాటని . కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈమెకి. ఇది శాశ్వతం కాదు. దీన్ని నమ్ముకున్నట్టయితే ఆశల అగ్నిలోపడే మిడతవలె నీవుకూడా మాడిపోతావు. అందువల్ల మోహాన్ని, భ్రమలనూ వదలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతమని నమ్ము. సర్వభూత దయాకరుడని ఆయన్ని గుర్తించు. నిరంతరమూ హరినామస్మరణ చేసుకో. కామమంటే కోరిక. కోపమంటే దురాగ్రహం. భయమంటే ఆత్మానాత్మీయ భంగత. లోభమంటే ధనవ్యయ చింత. మోహమంటే మమతాహంకారాలు.

[ఇది కొంత విశ్లేషణ చేస్తే బాగుంటుందిగాని సమయాభావంవల్ల చేయడంలేదు. దయచేసి అర్థంచేసుకుంటారని భావిస్తూ ముందుకు వెడుతున్నాను]

ఈఆరింటినీవదలిపెట్టు అని ఆ యాత్రికుడు ఆమెకు ఉపదేశం చేశారు. చేసి, కనీసం కార్తీకమాసంలోనైనా ప్రాతఃస్నానమాచరించు. విష్ణుప్రీతికై భగవదార్పణగా దీపదానంచెయ్యి తద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని. ఆయన వాక్మహిమ చేత ఆవిడకి జ్ఞానోదయమైంది. కార్తీకమాసంలో చన్నీళ్ళస్నానం చేయడం, దీపదానంచేయడం, హరిపూజ చేయడం, పురాణశ్రవణం చేయడం ప్రారంభించింది. తద్వారా స్వర్గ సుఖ భోగాలు పొందింది.

కాబట్టి, రాజా! కార్తీకమాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసిగాని, తెలియకగాని, ఎవరైతే దీపదానం చేస్తున్నారోవారు తమ పాపాలు నశింపజేసుకుంటున్నారు అనివశిష్ఠులవారు జనక మహారాజుకి చెప్పడంతో ఈ అధ్యాయం సమాప్తమవుతుంది

రేపటిరోజున, అంటే కార్తీక శుద్ధ చతుర్థి గణపతినిపూజిస్తాం. వంకాయ వదిలిపెట్టాలి. ఉసిరికాయ, వంకాయ వదిలిపెట్టాలి, నూనె, పెసరపప్పు దానాలు విశేషము. ఈరోజు చేసేటటువంటి పూజవల్ల అంటే చతుర్థినాడు చేసేటటువంటి పూజవల్ల సద్బుద్ధి, కార్యసిద్ధీ జరుగుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు!
ధర్మస్య విజయోస్తు!

Karthika Puranam – Day 3:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam

On the eve of the third day of the sacred Kaartheeka maasam, Let’s start the discourse on the third chapter of Kaartheeka Puraanam. This Kaartheeka Puranam was told by Sri Vashishta Maharshi to King Janaka. Sage Vashishta said, ”Janaka Mahaaraaja! Listen attentively. This Kaartheeka Maasa Vratham has the power to nullify all sins committed by us. Chanting Bhagavadgeetha in the presence of Vishnu during Kaartheeka maasam, rids one of all layers of sins, just like a snake shedding its skin. If chanting entire Bhagavadgeetha is not possible, chanting at least Chapters 10 and 11 will ensure the position of kshetra paalakaas (guardian of the region) in Vaikuntham (abode of VishNu). Performing Vishnu pooja with leaves/twigs of tulasi (basil) or black/white ganneru flower (oleander) will make one  reach Vaikuntam and enjoy all the benefits.

Yah Kaarthikechite vanabhojana maachareth
Swayaati Vaishnavam dhaama sarva paapa pramuchyathe

Participating in vanabhojanam ( group meal in a garden) during Kaartheeka maasam especially in the first fortnight of the month will relieve one of the sins. Whatever extraordinary fruits will accrue on one who performs chanting, fire ritual, feeding, pooja, water offering ritual, will be given to one who partakes food in a garden with all kinds of trees and especially aamla tree (goose berry). Keep a saalagraamam (holy shapeless stones found in river Gandaki) under an aamla tree, perform pooja with sandal powder, flowers, etc., and have a group meal. Those who do these in Kaartheeka maasam will be liberated from their sins and will attain VishNulokam (abode of Sri VishNu). Even listening with devotion and attention to Kaartheeka Mahathyam will give protection from all kinds of problems. That is why one must listen to Kaartheeka Puraanam with full attention. As an example Vashishta narrated Devadathopaakhyaanam (story of devadatta). On every day of the 30 days of this month during this month doing abhishekam (holy bath to the idol) with kasturi (musk), gandham (sandal wood), etc., to VishNu.

Sivaaya Vishnu roopaaya, Siva roopaaya Vishnave,
Sivasya hrudayam Vishur, Vishnoscha hridayam Siva.

When I say Siva I mean Vishnu also, and when I say Vishnu I mean Siva also. This is ordained by Vedas. Please remember this!

Performing this abhishekam is equivalent to special Asvamedha yaagam(A ritual that used to be performed in previous yugas). Those who do deepaaraadhana (lighting a lamp) or deepa Daanam (donating a lamp) in Kaartheeka maasam at dawn/dusk in the presence of Siva/Vishnu will attain VishNulokam.

Clean some cotton, make a wick, make a lamp of rice powder/ wheat powder, pour cow ghee in it, light the wick, invite a good brahmin, on the last day put a golden wick in a silver lamp, put it in rice powder and after pooja, etc. are completed, serve a meal to the brahmin, and chant the following sloka.

Sarvajnaana pradam deepam
Sarvasampad subhaavaham
Deepa daanam pradaasyaami
Saantirasthu sudaamama

 (I am donating a lamp which gives total wisdom, all wealth, all good things. May I be blessed with peace and pleasures.)

This will give unbounded punyam”.

After saying this, Vashishta continued by narrating a story of a widow in the southern part of India.

This lady, though a widow, started accumulating money due to great fondness for wealth. She used to work in households as a cook, tailor etc., and got attached to the money she was earning. On no day did she chant the name of Hari, nor listen to puraanas, nor visit holy places, nor even observe fasting on Ekaadasi (eleventh day of each fortnight of a lunar month). By God’s grace, a pilgrim visited her house, breaking his journey enroute a pilgrimage. Seeing the condition of this miserly lady, he felt that she was heading towards Hell. He took pity on her and decided to tell her a few good words of advice. He said, “ Oh innocent lady, listen to my words attentively. Think about them. Final decision is yours. This body is a leather toy consisting of blood, flesh, bones, pus etc., Realize that this body is temporary. It contains the five elements of Nature: earth, water, fire, air and space. As soon as the body drops down, those five elements will disperse in all four directions just like rain water flowing off the roof of a house. Life is not permanent and is like froth on water.

AdiShankara said:

nalinī-dalagata-jalamati-taralaṃ
tadvaj-jīvitam-atiśaya-chapalam ।
viddhi vyādhy-abhimānagrastaṃ
lokaṃ śokahataṃ cha samastam ॥

The guest said, “This life is not permanent. If you depend on it, you will be consumed by it, just like the moth which, attracted by the glow of the fire,  flies directly into it. Give up all illusions and attachments. Trust that God alone is permanent. Recognise that He is kind to all creatures. Chant the name of Hari always. Kaamam is desire, Kopam is anger, Moham is attachment (and so the inability to differentiate between Soul and non-soul), Lobham is miserliness (and so grief to spend money), madham is arrogance due to ego and maastsaryam is jealousy.

[These need some detailed explanation but lack of time prevents me. I hope you will understand]

“Give up these six enemies”, concluded the guest. “During Kaartheeka maasam, at least do early morning bath, donate a lamp for pleasing VishNu. By these acts, you will be protected from many sins.” By the power of his words, she realised what she had to do and acted accordingly. As a result, she attained Heaven after her death. So Raja! The most important aspect in Kaartheeka maaasam is donating a lamp. Those who donate a lamp knowingly or unknowingly are bringing down their sins”. With this discourse of Vasistha to King Janaka, this chapter is completed.

Tomorrow is Kaartheeka suddha chathurthi (fourth day) and we pray to Lord Ganesha. Tomorrow we must give up brinjal, and amla (goose berry). Donating oil, and yellow gram is beneficial. It will result in sadbuddhi (good sense) and kaaryasiddhi (task achievement.)

Sarvejanaassukhinobhavanthu
Dharmasya Vijayosthu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy